
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
విజయవాడ: పోలీసులు మందలించారనే కారణంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలోని చిట్టిగనర్ లో చోటు చేసుకుంది. తాజుద్దీన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో కలిసి పనిచేస్తున్న యువతితో సన్నిహితంగా మెలిగిన తాజుద్దీన్ ప్రేమించాలని కోరాడు. తన వెంట పడుతున్నాడని ఆ యువతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు అతడిని స్టేషన్ కు పిలిపించి మందలించారు. యువతి వెంటపడొద్దని హెచ్చరించి వదిలేశారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న మనస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాజుద్దీన్ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు.