లగడపాటి వెయ్యి ఎకరాలు కొన్నారు: ఆమోస్
హైదరాబాద్: రాష్ట్రం విడిపోదంటూ సమైక్యవాదులను ఎంపీ లగడపాటి రాజగోపాల్ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న లగడపాటి గుంటూరు- ప్రకాశం మధ్య వేయి ఎకరాలు ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో కొత్త రాజధాని వస్తుందనే లగడపాటి భూములను కొన్నారని ఆరోపించారు. ఇటువంటి మోసపూరిత నాయకుల పట్ల సీమాంధ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆమోస్ హెచ్చరించారు.
సీమాంధ్రలో సమ్మెను తక్షణమే విరమింపచేయాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని ఆమోస్ అంతకుముందు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం, ఏకాభిప్రాయం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రం పార్లమెంట్‌లో నేరుగా తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.