కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్‌తో ఉన్న లింక్‌ను తెంచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో ఇంకా నమోదు చేసుకోని 2,84,372 మందికి మేలు చేకూరింది. ఈ నమోదుకోసం ఇన్నాళ్లూ ఒత్తిడికి గురైన వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సబ్సిడీ సిలిండర్లను కూడా 9నుంచి 12కు పెంచడం కూడా అన్ని వర్గాలకూ ఉపశమనం లభించే చర్యే. ఫిబ్రవరి 1 నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమలుల్లోకి రా నుంది. దీంతో ఆధార్ కార్డు ఉన్న వారికే సబ్సిడీ, లేదంటే నాన్ సబ్సిడీ సిలిండర్లను పొందుకోవాల్సి ఉంటోంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం జిల్లాలో ఆధార్ నమోదు చేసుకోని వారందరికి విముక్తి కలిగింది. గత 8నెలలుగా ఆధార్ ఉంటేనే సబ్సిడీ గ్యాస్ ఇస్తామని అధికారులు, డీలర్లు సైతం వినియోగదారుల్ని భయబ్రాంతులకు గురిచెయ్యడంతో ఆధార్ కార్డులున్న వారంతా నమోదు చేసుకోవడంలో నానా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇక చాలా మందికి ఆధార్ కార్డుల్లేక వారి బాధలు చెప్పుకోలేనివిగా మారాయి.
38శాతం పూర్తి......
జిల్లా వ్యాప్తంగా బ్లాక్ అయిన నెంబర్లను మినహాయిస్తే ఇప్పటి వరకు భారత్, హెచ్‌సి, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల్లో 4,62,144మందిపైగా వినియోగదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,77,772 మంది వరకు ఆధార్ కార్డుల్ని గ్యాస్ ఆయా గ్యాస్ ఏజెన్సీల్లో, బ్యాంక్‌లో నమోదు చేసుకొన్నారు. న మోదు పుణ్యమా అంటూ వీరంతా గ్యా స్ రీఫిల్లింగ్‌కు రూ.1368చెల్లించి తీసుకొన్న తరువాత వారికి మాత్రం కేవలం రూ.645మాత్రమే సబ్సిడీగా వారి ఖా తాలో జమఅవుతోంది. ఇక రూ.723వినియోగదారులకు పడుతోంది. అంటే సబ్సిడీ సిలిండర్ ధర రూ.440 ఉండగా,అదనంగా రూ..283రూపాయలను చెల్లించాల్సి వచ్చేది.తాజా నిర్ణయంతో సిలిండరుకు నిర్ణీత ధరనే ఇంటివద్ద చెల్లిస్తే సరిపోతుంది.
‘లింక్’ తెగింది
Published Fri, Jan 31 2014 3:33 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement