కలెక్టరేట్, న్యూస్‌లైన్: విస్తారంగా వర్షాలు కురిసి దిగుబడి అధికంగా రావడంతో కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం వరదలా వచ్చి చేరుతోంది. ఇందుకు తగ్గట్టు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. తూకం వేసిన బస్తాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి మొలకెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ధాన్యం కొనుగోళ్లపై దృష్టిపెట్టలేదు. పోలిం గ్ పూర్తయ్యాక ఈనెల 4న ఆగమేఘాలపై కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లాలో ఈసారి 2.30 లక్షల హెక్టార్ల లో వరి సాగైనట్లు అధికారుల అంచనా. రబీసాగు ప్రకా రం 13 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుం దని... 619 కొనుగోలు కేంద్రాల్లో 5 లక్షల టన్నులు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 341 ప్రభుత్వ కొనుగోలుకేంద్రాలు, 13 మార్కెట్ కమిటీల ద్వారా 1.79 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. కొనుగోలుకేంద్రాల్లో 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. కల్లాల్లో మరో 2 క్వింటాళ్ల ధాన్యం ఉన్నట్లు సమాచారం.
ఎక్కడి ధాన్యం అక్కడే..
కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయకపోవడంతో కుప్పలు పేరుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు స్థలం కొరత ఏర్పడింది. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే లోడిం గ్, అన్‌లోడింగ్ చేస్తూ.. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యంగా తీసుకుంటున్నారు. రోజుకు నాలుగైదు లారీల ధాన్యం కేంద్రాలకు వస్తుంటే ఒకట్రెం డు వాహనాలనే మిల్లులకు తరలిస్తున్నారు. గత రబీలో రోజూ 15,000 మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈసారి 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాహనాల కొరతను వెంటనే పరిష్కరిస్తామని కరీంనగర్ డీఎస్‌వో చంద్రప్రకాశ్ తెలిపారు.
చెల్లింపులోనూ పరేషాన్..
ఆదివారం ఒక్కరోజే 25 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. శనివారం వరకు 270 ఐకేపీ కేంద్రాల ద్వారా 89,683 టన్నులు, 70 పీఏసీఎస్‌ల ద్వారా 64,231 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అయితే వీటికి సంబంధించిన చెల్లింపులు జరుపలేదు. శనివారం వరకు కొనుగోలు చేసిన 1.54 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం విలువ రూ.207 కోట్లు.
నేరుగా ఖాతాల్లోకి
ఈసారి అధికారులు ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు రైతుల బ్యాంకుఖాతాల వివరాలు నమోదు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ పద్ధతిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆయా బ్యాంకులు పాతరుణం రూపంలో ఆ మొత్తంలో నుంచి రికవరీ చేసుకుంటారేమోనని ఆందోళన చెందుతున్నారు.
కుప్పలు.. తిప్పలు
Published Mon, May 19 2014 2:16 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Advertisement