
సాక్షి, కర్నూలు జిల్లా: నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా నేపథ్యంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. రేపటి నుండి 25 వరకు అత్యవసర సర్వీసులు మాత్రమే సడలింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, రిటైల్ కూరగాయల అమ్మకాలకు ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, డీఎస్పీ చిదా నందరెడ్డి విజ్ఞప్తి చేశారు.