‘ఆమ్ ఆద్మీ’తో కలిసి పనిచేస్తాం: కఠారి | Loksatta Alliance with Aam Aadmi Party, says Katari Srinivasa rao | Sakshi
Sakshi News home page

‘ఆమ్ ఆద్మీ’తో కలిసి పనిచేస్తాం: కఠారి

Published Tue, Jan 7 2014 4:59 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

‘ఆమ్ ఆద్మీ’తో కలిసి పనిచేస్తాం: కఠారి - Sakshi

‘ఆమ్ ఆద్మీ’తో కలిసి పనిచేస్తాం: కఠారి

కడప:  కేజ్రీవాల్ స్థాపించిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీతో తాము కలిసి పని చేయనున్నట్లు లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు తెలిపారు. కడప వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్‌సత్తా పార్టీ బరిలోకి దిగుతోందన్నారు. ఈ నెల 11వ తేదీన వివరాలు వెల్లడవుతాయన్నారు. లోక్‌సత్తా పార్టీ మొద టి నుంచి సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మద్యం, యువతకు విద్య, తాగునీటి సమస్యపై దృష్టి సారించిందన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ నేతలతో కలిసి జనవరి 11 తేదిన సమావేశం కానున్నారు. దేశంలో రాజకీయేతర ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఇరుపార్టీలు కలిసి పనిచేసే అవకాశంపై చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement