బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి ఆనుకుని కేంద్రీకృతమైంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి ఆనుకుని కేంద్రీకృతమైంది. క్రమేపీ బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురులు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం నిపుణులు హెచ్చరించారు. సముద్రంలోకి వేటకు వెళ్లడం ఈ సమయంలో అంత మంచిది కాదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.