తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు, వికారాబాద్‌ల మీదుగా ముంబై, విశాఖపట్నం వెళ్లే లోకమాన్య తిలక్ టెర్మినల్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రైల్వే అధికారులు పొడిగించారు. ప్రస్తుతం వారంలో రెండు రోజులు నడుస్తున్న ఈ రైలును ఈ నెల 25నుంచే నాలుగు రోజులు నడుపుతున్నారు. ఈ రైలు జిల్లాలో తాండూరు, వికారాబాద్ స్టేషన్లలో ఆగుతున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి ఎల్‌టీటీ (నంబర్ 18519) వైపునకు ప్రతి ఆది, బుధ, గురు, శనివారాల్లో, ఎల్‌టీటీ నుంచి విశాఖపట్నం (నంబర్ 18520) వైపునకు ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
విశాఖపట్నంలో ఆయా రోజుల్లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు (సోమ, గురు, శుక్ర, ఆది) మధ్యాహ్నం 2.25 గంటలకు వికారాబాద్, మధ్యాహ్నం 3.30 గంటలకు తాండూరుకు వస్తుంది. అలాగే ముంబై ఎల్‌టీటీ టెర్మినల్ నుంచి ఆది, సోమ, గురు, శుక్రవారాల్లో బయలుదేరే రైలు అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు తాం డూరు, రాత్రి 7.30గంటలకు వికారాబాద్ రైల్వే స్టేషన్లలో రెండు నిమిషాలు ఆగి వెళ్తుంది. ఎల్‌టీటీ సర్వీసులను రెండు రోజుల నుంచి నాలుగు రోజులకు పొడిగించడంతో ముంబై, విశాఖపట్నం వెళ్లేందుకు మరింత సౌలభ్యం లభించిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వారంలో నాలుగు రోజులు ఎల్‌టీటీ
Published Fri, Dec 27 2013 11:14 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement