గతి లేకనే కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరుతున్నారు. ఎప్పటికైనా అది బంగాళాఖాతంలో కలసిపోయే పార్టీయేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
మాజీ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి చేరిక వైఎస్‌ఆర్‌సీపీకి బలం చేకూరుస్తుందని కర్నూలు పార్లమెంట్ ఇన్‌చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
బుధవారం ఆయన పరిచయ కార్యక్రమం సందర్భంగా గూడూరు మండల పరిధిలోని ఆయన అనుచరులు, రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల వర్గీయులు పెద్ద సంఖ్యలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుట్టా రేణుక, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మణిగాంధీ, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గతి లేకనే కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరుతున్నారు. ఎప్పటికైనా అది బంగాళాఖాతంలో కలసిపోయే పార్టీయేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కర్నూలు మాజీ ఎంపీపీ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా బుధవారం పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విష్ణు చేరిక పార్టీకి మరింత బలం చేకూరుస్తుందన్నారు.
మంచి స్వభావం కలిగిన వారికే పార్టీలో చోటు దక్కుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బుట్టా రేణుక మాట్లాడుతూ తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కోరారు.
పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మొట్టమొదటి నాయకుడిని తానేనన్నారు. జగన్‌ను సీఎంగా చూడటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు, కోడుమూరు, పాణ్యం అసెంబ్లీలతో పాటు కర్నూలు పార్లమెంట్ పరిధిలో విష్ణు సేవలు పార్టీకి ఎంతగానో ఉపయోగకరమన్నారు. అందరూ సమష్టిగా అన్నదమ్ముల్లా పని చేయాలని కోరారు.
అనంతరం కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. విష్ణు మాట్లాడుతూ జగన్ భావాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆయన సీఎం కావడం రాష్ట్రానికి ఎంతైనా అవసరమన్నారు. కాంగ్రెస్, టీడీపీలను మట్టికరిపించేందుకు సైనికుల్లా పని చేయాలన్నారు.
కార్యక్రమంలో హఫీజ్‌ఖాన్, పత్తికొండ మురళీదర్‌రెడ్డి, పులకుర్తి రాజారెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎదురూరు రాంభూపాల్‌రెడ్డి, కేపీ స్వామి తదితరులు పాల్గొన్నారు.