సాక్షి,నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పార్టీలకు అతీతంగా జిల్లా ప్రజ లు తరలివచ్చి విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క న్వీనర్ మేరిగ మురళీధర్ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఇందుకోసం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటికే పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు.
షర్మిల సైతం శంఖారావం బస్సుయాత్రను సీమాంధ్ర ప్రాంతంలో నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ సభకు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు పార్టీలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలు సీమాంధ్రకు తీరని ద్రోహం చేశాయని విమర్శించారు.
కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసుకునేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆరోపించారు. ఇందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహకరించడం దారుణమన్నారు. బాబు సీమాంధ్రకు చెందిన వాడిగా ఉండి రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వడం దారుణమన్నారు. సీమాంధ్రులు బాబును క్షమించరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి సీమాంధ్రులు గ ట్టిగా బుద్ధిచెబుతారన్నారు. సీమాం ధ్రుల ఉద్యమాలను కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు.
నెలల తరబడి సీమాంధ్రులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. ఇదంతా సీమాంధ్రులు మరువరన్నారు. తగిన సమయం చూసి బుద్ధిచెబుతారని తెలిపారు. సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు మురళీ చెప్పారు. సమన్వయకర్తలందరూ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రికి అందరూ హైదరాబాద్‌కు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు.
సమైక్య శంఖారావం సభను సక్సెస్ చేయండి
Published Fri, Oct 25 2013 3:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement