కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండు గ్రామంలో విద్యుతాఘాతంతో ఒక విద్యార్థి మృతిచెందాడు.
కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండు గ్రామంలో విద్యుతాఘాతంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు.. హనుమంతుగుండు గ్రామానికి చెందిన అమర్ (18) అనే యువకుడు మేకల కోసం ఇంటి ముందు ఉన్న వేపచెట్టు ఎక్కి కొమ్మలు తుంచుతుండగా విద్యుత్ షాక్ తగిలి చెట్టు పైనే మృతి చెందాడు. చెట్టుపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్ తగలడంతో షాక్ కొట్టిందని స్థానికులు తెలిపారు. అధికారులకు సమాచారం అందించి కరెంట్ సరఫరాను నిలిపివేసి విద్యార్థి మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.