కట్నం కోసం వివాహిత హత్య | Man murders wife for dowry | Sakshi
Sakshi News home page

కట్నం కోసం వివాహిత హత్య

Published Thu, Jun 26 2014 12:36 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

కట్నం కోసం వివాహిత హత్య - Sakshi

కట్నం కోసం వివాహిత హత్య

 తిరుమలదేవిపేట(టి.నరసాపురం) : వరకట్న పిశాచికి మహిళలు బలి అవుతూనే  ఉన్నారు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను సైతం చంపేందుకు భర్తలు వెనుకాడటం లేదు. బుధవారం తెల్లవారు జామున టి.నరసాపురంలో మండలం తిరుమలదేవి పేటలో గ్రామానికి చెందిన చలమాల అనూష(20)ను ఆమె భర్త వీరాంజనేయులు(అంజిబాబు) కొట్టి చంపాడు. అనంతరం అనూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రికి ఫోన్‌చే సి చెప్పాడు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన బోట్ల శోభనాద్రి మూడో కుమార్తె అనూషను తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన చలమాల సోమరాజు కుమారుడు అంజిబాబుకు ఇచ్చి ఈ ఏడాది మార్చి 16వ తేదీన వివాహం చేశారు.

 పెళ్లి సమయంలో రూ.50 వేల నగదు, బంగారపు ఉంగరం కట్నంగా ఇచ్చారు. పెళ్లైన 25 రోజుల నుంచి మరో రూ.50 వేలు అదనపు కట్నం తీసుకురావాలని అనూషను భర్త అంజిబాబు వేధించడం మొదలు పెట్టాడు. దాంతో ఆమె తండ్రి మరో రూ.25 వేలు తీసుకొచ్చి అల్లుడికి ఇచ్చాడు. అదనపు కట్నం కోసం అల్లుడే తన కుమార్తెను చంపాడని మృతురాలి తండ్రి శోభనాద్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జీజే విష్ణువర్థన్ వరకట్నం కోసం హత్యచేసినట్లు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావు, తహసిల్దార్ ఎల్.దేవికాదేవి పరిశీలించారు. మృతదేహానికి గురువారం శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement