సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానానికి విరుద్ధంగా, హైదరాబాద్‌పై కిరికిరి పెడితే సహించబోవుని, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. ఆయన సోమవారం హైదరాబాద్ పార్శిగుట్టలోని ఎవ్మూర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణపై సీడ బ్ల్యూసీ నిర్ణయూనికి కట్టుబడాలని, హైదరాబాద్‌పై మూడు రకాల విధివిధాలను పరిశీలిస్తున్నట్టు కాంగ్రెస్ ఇస్తున్న లీకులు, తెలంగాణ ప్రజలతో అంతర్యుద్ధానికే దారితీస్తాయుని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన సీమాంధ్ర పేద ప్రజల కోసమా?, పెట్టుబడిదారుల కోసమా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు అనుకూలంగా 2008లోనే లేఖ ఇచ్చిన చంద్రబాబు అప్పుడు ఇరుప్రాంత ప్రజలను కూర్చోబెట్టి ఏ సమస్యను పరిష్కారించారో చెప్పాలన్నారు. గవర్నర్‌కు, రాష్ట్రపతికి సీవూంధ్ర మంత్రుల భార్యలు ఇపుడు వినతి పత్రాలివ్వడం సరికాదని, వెయ్యిమందికిపైగా తెలంగాణ పిల్లల ఆత్మహత్యలు, ఆ తల్లిదండ్రుల పుత్రశోకంపై వారు ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. ఆ తల్లిదండ్రుల గర్భశోకం దేశానికి వినిపించేలా వచ్చేనెల 27న మహిళలతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామన్నారు. గుంటూరులో అక్టోబర్6న అంబేద్కర్ సభను, అక్టోబర్ 20న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో వికలాంగుల గర్జనను నిర్వహిస్తావున్నారు. ఈ నెల 25న తెలంగాణ విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సంఘాలతో సమావేశంపెట్టి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను తాను అక్టోబర్ 7నుంచి 17వరకు పరామర్శిస్తానన్నారు. యాతకుల భాస్కర్ మాదిగ, రాజ ఎల్లయ్య మాదిగ, అందె రాంబాబు తదితరులు విలేకరుల సవూవేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌పై కిరికిరి పెడితే సహించం: మంద కృష్ణ
Published Tue, Sep 24 2013 1:38 AM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM
Advertisement
Advertisement