సొసైటీ కార్మిక వ్యవస్థకు మంగళం!
నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నెల్లూరు నగర పాలక సంస్థలో కీలక పాత్ర వహిస్తున్న సొసైటీ కార్మిక వ్యవస్థకు మంగళం పాడేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సు మారు 1500 మంది బతుకులు వీధిన పడనున్నాయి. గత కొన్నేళ్లుగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతున్నా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ పట్టించుకోలేదు.
తాజాగా గత నెల 30న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వ్యవస్థను రద్దు చేయాలని, పారిశుధ్యం మెరుగు పరిచే వ్యవహారాన్ని ఏజెన్సీలకు అప్పగించాలని సూచిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచి అకస్మాత్తుగా అందరిపై వేటు వేయాలని నగర పాలక సంస్థ అధికారులు భావించారు. ఈ విషయం కాస్త బట్టబయలైంది. దీంతో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఆందోళన ప్రారంభమైంది. నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో సుమారు 870మంది పారిశుధ్య కా ర్మికులు పనిచేస్తున్నారు. ఇంజనీరిం గ్ విభాగంలో సుమారు 300 మంది, వివిధ విభాగాల్లో మరో 400 మంది పని చేస్తుం టారు. వీరందరికి ఈఎస్‌ఐ, పీఎఫ్ కోత వేసి జీతాలు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నారు.
ఏజెన్సీలకు అప్పగింత ఇలా : రెండు, మూడు వార్డులు కలిపి ఒక ఏజెన్సీకి పారిశుధ్యంతో పాటు నీరు వదిలే బాధ్యత అప్పగిస్తారు. వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరచడం, నీరు వదలడం వంటి కార్యక్రమాలను ఆ ఏజెన్సీనే నిర్వహిస్తుంది. ఎంతమంది కార్మికులను నియమించుకోవాలనేది ఆ ఏజెన్సీ ఇష్టం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
పాలకవర్గం వచ్చే లోపే : పాలక వర్గం వచ్చేలోపు ఏజెన్సీలకు టెండర్లు పిలవాలనే ఆలోచనలో అధికారులున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం సాంకేతిక విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఓ ముఖ్యఅధికారి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ఒక్క కలం పోటుతో వందల మంది ని రోడ్డున పడేసి ఆ అధికారి తన అనుయాయులకు ఈ ఏజెన్సీలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ అధికారి నిర్వాకం కారణంగా సుమా రు 15 మంది సెక్యూరిటీ గార్డులు వీధిన ప డ్డారు. తాజాగా ఆ ఉన్నతాధికారి 1500 మందికి ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. పాల కవర్గం వచ్చేలోపు ఈ వ్యవహారాన్ని ముగిం చాలని ప్రయత్నిస్తున్న ట్టు తెలిసింది. పాలకవర్గం వస్తే ఈ వ్యవహారానికి చెక్ పెడుతుం దని భావించి ఏజెన్సీలకు కట్టబెట్టాలని భావిస్తున్నారని సమాచారం.