గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మందాడి గ్రామానికి చెందిన మాదరమ్మ (30) శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆమె గత కొంత కాలం నుంచి భర్త నుంచి వేరుగా ఉంటోంది. అయితే, ఆమె మృతిపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.