కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో శనివారం జరిగింది.
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో శనివారం జరిగింది. యడ్లపాడులో రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బండారు లక్ష్మీ(23) అనే వివాహిత ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలంటుకున్న కొన్ని నిమిషాలకే బండారు లక్ష్మీ మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.