మేదరమెట్ల : ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని మేదరమెట్ల మార్కెట్ యార్డు వెనుక వైపు బజారులో సోమవారం జరిగింది. మృతురాలి మామే హత్య చేసి కోడలు ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలేనికి చెందిన ధనలక్ష్మిని మేదరమెట్లకు చెందిన వల్లెపు అనిల్‌కు ఇచ్చి నెలా 20 రోజుల క్రితం వివాహం చేశారు. భర్త, అత్తమామలతో కలిసి ధనలక్ష్మి నివాసం ఉంటోంది. వారం నుంచి పక్కనే ఉన్న మరో ఇంట్లో కొత్త దంపతులు ఉంటున్నారు. ధనలక్ష్మి బేల్దారి పనికి వెళ్తోంది.
కోడలిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన మామ విఫలమై హత్య చేసి ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వల్లెపు రామయ్య, శేషమ్మల మూడో కుమారుడు అనిల్‌కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. ధనలక్ష్మితో మూడో పెళ్లి. గతంలో అనిల్ ఇద్దరి భార్యలను కూడా మామ రామయ్య లైంగికంగా వేధించినట్లు స్థానికులు తెలిపారు. ధనలక్ష్మి ఉరేసుకున్న ఆనవాళ్లు అక్కడ కనిపించడం లేదు. ఎవరూ రాకుండానే ఆమెను కిందకు దించి మామ, అత్త, భర్త పరారయ్యారు. స్థానికులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ధనలక్ష్మి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బంధువుల సమాచారంతో మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తహశీల్దార్ పీవీ సాంబశివరావు, ఎస్సై రాజమోహన్‌రావులు శవపంచనామా నిర్వహించారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ ప్రతాప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
పెళ్లయిన 50 రోజులకే..
Published Tue, Oct 7 2014 1:16 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement