విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జనవరిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనలియర్ పార్టు-2 పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మార్కుల రీ టోటలింగ్ కోసం ఏప్రిల్ 15లోగా సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డి.విజయకుమార్ శుక్రవారం తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రొటేటరీ ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఫలితాలను హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్‌లో చూడవచ్చని ఆయన తెలిపారు. కాగా, ఫైనలియర్ పార్టు-2 ఫలితాల్లో గుంటూరు కాటూరి మెడికల్ కళాశాల విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు విజయ్‌కుమార్ తెలిపారు.