అరవయ్యేళ్లకు కలిశారు! | meet old friends after 600 years | Sakshi
Sakshi News home page

అరవయ్యేళ్లకు కలిశారు!

Published Sat, Jul 16 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

అరవయ్యేళ్లకు కలిశారు!

అరవయ్యేళ్లకు కలిశారు!

చందర్లపాడు: పూర్వ విద్యార్థుల కలయికతో కృష్ణాజిల్లా చందర్లపాడు పులకించిపోయింది. ఆరు దశాబ్దాల క్రితం విడిపోయిన మిత్రుల కలయికకు స్థానిక యార్లగడ్డ సుబ్బారావు స్వగృహం వేదికగా మారింది. 1956లో స్థానిక వాసిరెడ్డి కోటయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్సీ చదివిన విద్యార్థులు కలుసుకొని మధురానుభూతులు పంచుకున్నారు.


వారి ఆప్తమిత్రుడు సుబ్బారావు 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారులు వెంకట్రావు, బాపయ్య, చంటి, బుల్లబ్బాయి, సత్యనారాయణప్రసాద్‌ల నుంచి ఆహ్వానం అందుకున్న పూర్వ విద్యార్థులు తమ మిత్రుడికి అంజలి ఘటించేందుకు సామూహికంగా తరలివచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒక్కటిగా కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement