రాష్ట్రంలో మెగా సీడ్‌ పార్కు | Mega seed park in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మెగా సీడ్‌ పార్కు

Published Tue, May 9 2017 1:56 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

రాష్ట్రంలో మెగా సీడ్‌ పార్కు - Sakshi

రాష్ట్రంలో మెగా సీడ్‌ పార్కు

- సుముఖత వ్యక్తం చేసిన ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ
- వర్సిటీ డీన్‌తో సమావేశమైన చంద్రబాబు బృందం

సాక్షి, అమరావతి:
ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ ఏపీలో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ డీన్‌ ప్రొఫెసర్‌ వెండీ వింటర్‌ స్టీన్‌ అంకురార్పణ చేసినట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగోరోజు అమెరికా పర్యటన వివరాలను తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ముఖ్యమంత్రి బృందం నాలుగోరోజు ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీని సందర్శించింది. విత్తనాభివృద్ధి, పరిశోధనా రంగంలో సహకారం అందించేందుకు యూనివర్సిటీ అంగీకరించింది. రాష్ట్రంలో మెగా సీడ్‌ పార్కు నెలకొల్పాలని ముఖ్యమంత్రి కోరగా ఇందుకు యూనివర్సిటీ సుముఖత వ్యక్తం చేసింది. అంతకుముందు ఐయోవా రాష్ట్ర వ్యవసాయ మంత్రి బిల్‌ నోర్తి, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌న్‌ అధ్యక్షుడు కెన్నెత్‌ క్విన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.

తెలుగువారంతా బాహుబలులే: ఐయోవా పర్యటన తర్వాత శాన్‌ హుజ్‌ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగుజాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ శాన్‌ హుజ్‌ మేయర్‌ సామ్‌ లికార్డో, కాంగ్రెస్‌ ప్రతినిధి రో ఖన్నా, సెనెటర్‌ బాబ్‌ వెల్‌ కౌస్కీ, అసెంబ్లీ సభ్యులు కాన్సాన్, ఆస్‌ కల్రాలను సీఎం కలిశారు.

సిలికానాంధ్రలో అమరావతి భాషా శాస్త్ర పీఠం: సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో మిలియన్‌ డాలర్లతో అమరావతి భాషా శాస్త్ర కేంద్రం (Amaravathi  chool of Linf uirticrChair) ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ’మనబడి’ దశాబ్ది వేడుకల లోగోను ఆవిష్కరించారు. భారతీయ కళలైన కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యాలలో ఎంఏ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్స్‌లు అందించే తొలి అమెరికా విశ్వవిద్యాలయం సిలికానాంధ్రను ఆయన శనివారం ఉదయం సందర్శించారు. భాష, సంస్కృతి పరిరక్షణకు యూనివర్సిటీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. సిలికానాంధ్ర అధ్యక్షులు ఆనంద్‌ కూచిభొట్ల, డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి సీఎంను సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement