గుంటూరు ఘటనపై ఏపీ పురపాలక మంత్రి నారాయణ స్పందించారు.
అమరావతి: గుంటూరు ఘటనపై ఏపీ పురపాలక మంత్రి నారాయణ స్పందించారు. గుంటూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాలుడిని కుక్కలు చంపాయంటే మున్సిపల్ శాఖకు సిగ్గుచేటుగా ఉందన్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వివరణ ఇవ్వాలని గుంటూరు కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కుక్కల స్టెరిలైజేషన్ పూర్తి స్థాయిలో చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.