
బాధ్యతలు స్వీకరిస్తున్న మిషాసింగ్
విజయవాడ: తన తొలి పోస్టింగ్‌లో సబ్–కలెక్టర్‌గా విజయవాడలో బాధ్యతలు చేపట్టడం జీవితంలో ఓ మరచిపోలేని అనుభూతి అని సబ్‌కలెక్టర్ మిషాసింగ్ అన్నారు. సోమవారం ఆమె సబ్–కలెక్టర్ కార్యాలయంలో సబ్–కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమన్నారు. దేవుడు తనకిచ్చిన సదవకా«శాన్ని వినియోగించుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతనిస్తానన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం, కాలయాపన లేకుండా పని చేస్తానని చెప్పారు. విధి నిర్వహణలో అంకితభావం చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు. ప్రధానంగా భూవివాదాలు, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తాన్నారు. డివి జన్ స్థాయిలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
‘మీకోసం’లో ఫిర్యాదుల స్వీకరణ..
సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మిషాసింగ్ కార్యాలయంలో ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ముందుగా కార్యాలయంలో పని చేసే సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. సబ్–కలెక్టర్ కార్యాలయం ఏఓ రాజకుమారి, ఉద్యోగులు స్వాగతం పలికారు. అంతకుముందు సబ్–కలెక్టర్ మిషా సింగ్ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment