
చిత్తూరు, విజయపురం: నియోజకవర్గ కేంద్రమైన నగరి పట్టణంలో నిర్వహిస్తున్న గంగ జాతరలో భాగంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం వెయ్యి మందికి చీరలు పంపిణీ చేశారు. స్థానిక పెరుమాళ్ గుడి నుంచి వెయ్యి మందితో ఎమ్మెల్యే ఊరేగింపుగా వచ్చారు. ఏటాలాగే దేశమ్మ, ఓరుగుంటాలమ్మకు చీరలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి చీరలు ఇస్తున్నట్లు రోజా పేర్కొన్నారు. పట్టణ ప్రజలను గంగమ్మ చల్లగా చూడాలని..జగనన్న సీఎం కావాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.