
సాక్షి, అమరావతి : చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. షాద్‌నగర్ కేసులోని నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం వల్ల దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. ఈ విషాద ఘటన జరిగింది పొరుగు రాష్ట్రమే అయినా అది తమ సోదర రాష్ట్రమని, తెలుగు వారిగా, సాటి మనుషులుగా స్పందిస్తున్నామన్నారు. దిశను అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన వారికి సరైన శిక్ష పడిందని పేర్కొన్నారు. అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇలాంటి శిక్షలే సరి అన్నారు. మరోసారి ఇలాంటి దుర్మార్గాలకు ఎవరూ ఒడిగట్టకుండా కఠిన శిక్ష విధించేలా చట్టాలను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే చెప్పినట్లు, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే రోజా తెలిపారు.
చదవండి: ఈ ఎన్‌కౌంటర్ హెచ్చరిక కావాలి: అనుపమ
అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్
దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్