రాయలసీమ ఎడారిగా మారడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: రాయలసీమ ఎడారిగా మారడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తన ఊరిని అభివృద్ధి చేయలేని బాబు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారన్నారు. పుట్టిన ఊరిని, జిల్లాను అభివృద్ధి చేశానని బాబు చెప్పగలరా అని ఆయన ధ్వజమెత్తారు.
చంద్రబాబు తన భాషను సరిచేసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బాబు మానుకోవాలని ఆయన అన్నారు.