అనంతపురం: అనంతపురం జిల్లా కనేకల్లులోని రామ్‌నగర్ కాలనీ చెరువులో ఓ మహిళ తన కుమారుడితో కలసి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి... తల్లీకుమారుడిని చెరువు నుంచి బయటకు తీశారు.
అయితే ఈ ఘటనలో తల్లి ఫక్రుమా (38) అప్పటికే మృతి చెందింది. తొమ్మిదేళ్ల బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే అతడ్ని చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ఫక్రుమా మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మాహత్యాయత్నం: తల్లి మృతి
Published Fri, Mar 25 2016 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM
Advertisement
Advertisement