కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలపై మళ్లీ కదలిక వచ్చింది. ఎన్నికలను తక్షణమే నిర్వహించాలన్న హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికలు తప్పవన్న అడ్వకేట్ జనరల్ అభిప్రాయం నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది. చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లను శనివారం ప్రకటించాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రిజర్వేషన్లకు రాజ్‌భవన్ నుంచి ఆమోదముద్ర వేయించుకుని ఉత్తర్వులు జారీ చేయ డానికి సిద్ధమైంది. ఆదివారం ఆయా మున్సిపాలి టీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈమేరకు పురపాలక శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ధరావత్తు పెంపు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసే కౌన్సిల ర్లు, కార్పొరేటర్ల దరావతు(డిపాజిట్)ను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2500 మిగిలిన వర్గాలకు రూ.5000గా నిర్ణయించింది. గతంలో ఇది రూ.వెయ్యి, రూ. 2500 ఉంది. ధరావతు చెల్లించే వారి నామినేషన్లనే పరిగణ లోకి తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని, ఎప్పుడు అడిగినా ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పురపాలకశాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. ఎన్నికల సామగ్రిని, ఎన్నికల అధికారును పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని సూచించారు.
వార్డుల రిజర్వేషన్లు పూర్తి
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్ల
ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్, రామగుం డం కార్పొరేషన్ల పరిధిలో రిజర్వేషన్లను ఖరా రు చేసి మున్సిపల్ వ్యవహారాల శాఖకు పం పారు. అధికారికంగా ఈ రిజర్వేషన్లను ప్రకటించవలసి ఉంది. మేయర్లు, చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా ఖరారు చేస్తారు. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీల పరిధిలోని వంద డివిజన్లు, 226 వార్డులకు ఎప్పుడయినా ఎన్నికల నిర్వహణకు బల్దియా అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారు.
ఎన్నికలు జరిగేనా?
ఇప్పటికే పలుమార్లు ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఓవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మరోవైపు రాష్ట్రపతి పాలన, త్వరలో సాధారణ ఎన్నికలు.. ఇన్ని అవాంతరాల మధ్య మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, సమయం కావాలని మొదట హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన సర్కారు కు అక్కడా చుక్కెదురైంది. ఎన్నికలు నిర్వహణ అనుమానంగానే ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశంతో మున్సిపాలిటీల్లో హడావుడి షురువైంది. మున్సిపాలిటీల పదవీకాలం 2010 సెప్టెంబర్‌లో ముగిసినప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
బల్దియాలకు ఎన్ని‘కల’
Published Sat, Mar 1 2014 3:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement