17 నుంచి మున్సిపల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
Published Thu, Oct 10 2013 4:31 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఈనెల 17 నుంచి నిరవధిక సమ్మె బాటపట్టనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. సమ్మె సన్నాహక రౌండ్‌టేబుల్ సమావేశం ఏపీ మున్సిపల్ వర్కర్‌స అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జె.రమేష్ అధ్యక్షతన సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగింది.
సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్యాణం వెంకటేశ్వరరావు, జి.రామయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్‌స ఫెడరేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి తీగల వెంకన్న మాట్లాడుతూ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లోని పర్మనెంట్, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలన్నారు.
దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈనెల 11న మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు టి.లింగయ్య, టి.విష్ణువర్ధన్, కిషోర్, ఏఐటీయూసీ నాయకులు లకీష్మనారాయణ, ఐఎఫ్‌టీయూ నాయకులు యాకూబ్‌షావలీ, రామారావు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు జింకల శ్రీను, జల్లి లకీష్మనారాయణ, వెంకటరమణ, జానకమ్మ, బొడ్డు వెంకన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement