కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవన్‌లో పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అథారిటీలు, అధికారులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమై జిల్లాలో చట్టం అమలు తీరు తెన్నులపై సమీక్షిం చారు. పారదర్శకత, జావాబుదారీ త నం పెంపొందించేందుకు రూపొందిం చిందే సమాచార హక్కు చట్టం అని పేర్కొన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులకు సదరు సమాచారం కోర్టు పరిధిలో ఉన్నా దాపరికం లేకుండా ఇవ్వాలన్నారు. ప్రశ్నించేతత్వం ప్రజల్లో పెంపొందిన నాడే ఈ చట్టానికి సార్థకత చేకూరుతుందన్నారు. డివిజన్‌స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరారు.
చట్టంలోని 4(1) బి సెక్షను ప్రకారం పూర్తిస్థాయి సమాచారాన్ని పొందుపర్చాలన్నారు.కలెక్టర్ చిరంజీ వులు మాట్లాడుతూ ఆదేశ సూత్రాలన్నీ ప్రస్తుతం చట్ట రూపంలో వస్తున్నట్లు వివరించారు. జిల్లాలో అధికారులంద రూ సమాచార హక్కు చట్టం అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు తమ శాఖాపరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పోలీస్‌శాఖలో మానవ హక్కుల కమీషన్, సమాచార హక్కు చట్టంపై వచ్చే అర్జీలపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశం లో జేసీ హరిజవహర్‌లాల్,ఏఎస్పీ రమారాజేశ్వరి, డీఆర్‌ఓ అంజయ్య, ఆర్డీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి
Published Fri, Feb 7 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement