రైల్వే లైన్ సర్వే భూముల పరిశీలన
వింజమూరు: నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి సర్వే చేసిన అటవీ భూములను రైల్వే-అటవీ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం పరిశీలించారు. వింజమూరు, కాటేపల్లి, డక్కనూరు, రాజోలు తదితర ప్రాంతాల్లో రైల్వేలైన్ కోసం సర్వే చేసిన భూములను కావలి సబ్‌డివిజన్ డీఎఫ్‌ఓ సీహెచ్ నాగభూషణం, రైల్వే సీనియర్ ఇంజినీరు సీహెచ్ సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీహెచ్ నాగభూషణం మాట్లాడుతూ 97.2 హెక్టార్లలో అటవీ భూములు రైల్వే శాఖకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ రైల్వే లైను నిడివి 308.7 కిలోమీటర్లు కాగా మన జిల్లాలో 145 కిలోమీటర్లు లైను ఏర్పాటవుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 110 కి.మీ, మిగిలినది గుంటూరు జిల్లాలో ఉందన్నారు. మొత్తం బడ్జెట్‌లో రూ.800 కోట్లు భూముల నష్ట పరిహారం కోసం కేటాయించారన్నారు.