సాక్షి, నల్లగొండత్యాగమూర్తుల ఆశయాలు నెరవేర్చడానికి,స్వాతంత్య్ర ఫలాలను అందరికీ అందజేయడానికిఅకుంఠిత దీక్షతో కృషి చేద్దామని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాపేరును ప్రపంచ చరిత్రలో లిఖించిన మహనీయులనుస్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తద్వారా జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కుతుందన్నారు.
67వ స్వాతంత్య్ర దిన వేడుకలు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారంఘనంగా జరిగాయి. కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు,ఎస్పీ టి. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోజరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జానారెడ్డి హాజరైజాతీయ పతాకావిష్కరణ చేశారు.పోలీసుల నుంచి గౌరవవందనంస్వీకరించారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో నేలకొరిగిన మహనీయులతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మంత్రి జోహర్లు అర్పించారు.అనంతరం ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం మంత్రిమాటల్లో.....రైతు సర్వతోముఖాభివృద్ధికి....‘‘రైతు సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతాంగానికి ఎల్లవేళలా అండగా ఉంటుంది.ప్రకృతి కరుణించడంతో జిల్లాలోని ప్రాజెక్టులన్నీనిండుకుండలా మారిపోయాయి.
త్వరలోనే చెరువులకు జలకళ రానుంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.9 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటికే 3.84లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రూ.3.52 కోట్లఖర్చుతో రైతులకు 43,176 క్వింటాళ్ల విత్తనాలు సబ్సిడీపైపంపిణీ చేశాం. గతేడాది ఖరీఫ్‌లో నెలకొన్న దుర్భర పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.
రైతులను ఆదుకోవడానికి రూ.55 కోట్లపెట్టుబడి రాయితీ విడుదల చేసింది. నీలం తుపాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.27.31 లక్షల ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీ చేశాం. వడ్డీ మాఫీ....ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వడ్డీలేని పంట రుణాల పథకంకింద ఇప్పటివరకు 2.74 లక్షల మంది రైతులకు రూ.28.15కోట్లు వడ్డీ మాఫీ చేశాం. తక్కువ నీటితో ఎక్కువ భూమిసాగులోకి తెచ్చి అధిక దిగుబడి సాధించేందుకు బిందు,తుంపర సేద్యాన్ని అమలు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.40.36 కోట్ల ఆర్థిక సహాయంతో 5,427 మంది లబ్ధిదారులకు 5,100 హెక్టార్లలో తుంపర సేద్యం యూనిట్లుమంజూరయ్యాయి. పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగాగతేడాది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద జిల్లాలో 4,600ముర్రా జాతి గేదెలను, సంకర జాతి ఆవులను రూ.6.71 కోట్లసబ్సిడీతో లబ్ధిదారులకు అందచేశాం. ఈ ఏడాది రూ.61 లక్షలవ్యయంతో 440 పాడిపశువులను అందజేస్తాం.డిసెంబర్ నాటి కి ఎస్సారెస్పీ పూర్తి...ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టురెండో దశ పనులన్నీ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 19 మండలాల్లోని మొత్తం 198 గ్రామాలపరిధిలో 2.57 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకురూ.323.86 కోట్ల వ్యయంతో రెండోదశ పనులు మొదలుపెట్టాం. ఇప్పటివరకు రూ.262.4 కోట్లు ఖర్చు చేశాం. 1.62లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు అవసరమైనపనులు చేపట్టాం. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును 2019నాటికి పూర్తి చేయాలని చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 45,671 ఎకరాలకు సాగు నీరందించాలని యోచిస్తున్నాం.
నూతన ఆయకట్టు.....నాబార్డు, ఆంధ్రప్రదేశ్ చెరువుల భాగస్వామ్య యాజమాన్యం తదితర పథకాల కింద 7,300 ఎకరాల నూతన ఆయకట్టు కల్పించడానికి, 62వేల ఎకరాల స్థిరీకరణకు రూ.214.89కోట్లతో 336 పనులు చేపట్టాం. అలాగే జపాన్ బ్యాంకుసహాయంతో రూ.39.80 కోట్లతో డిండి, ఆసిఫ్‌నహార్ ప్రాజెక్టుఆధునికీకరణ పనులు చేపట్టాం. ఈ పనులు వచ్చే ఏడాదిమార్చిలోపు పూర్తవుతాయి. ఇదే స్పూర్తితో రూ.23.58 కోట్లవ్యయంతో చేపట్టిన 7,800 ఎకరాలకు సాగునీరందించేపిల్లాయిపల్లి, రూ.14.53కోట్లతో 7,500 ఎకరాలకు నీరుపారించే బునాదిగాని కాలువ పనులు సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఫ్లోరైడ్ విముక్తికి చర్యలు....ఫ్లోరోసిస్ వ్యాధిని నియంత్రించేందుకు కృష్ణా జలాలను1166 గ్రామాలకు అందించేస్తున్నాం.
ఇప్పటివరకు రూ.578కోట్లు ఖర్చు చేశాం. అలాగే గతేడాది జాతీయ గ్రామీణ తాగునీరు పథకం కింద ఆయా నియోజకవర్గాల పరిధిలోని1,494 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించేందుకు రూ.642కోట్ల వ్యయంతో పథకాలు చేపట్టాం. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగిల్ విలేజ్ పథకం కింద సుమారు రూ.65 కోట్లఅంచనా వ్యయంతో 742 గ్రామాలకు తాగునీరు అందించడానికి నిధులు మంజూరయ్యాయి. ఫ్లోరోసిస్ సమస్యలనుజిల్లాలో శాశ్వతంగా నియంత్రించడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌విద్యాసంస్థల్లో చదువుతున్న 5లక్షలమంది పైచిలుకు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాం.
మౌలిక వసతుల కల్పన...నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ కాలనీలలో రూ.13కోట్లఖర్చుతో తాగునీరు, విద్యుత్, అంతర్గత రహదారులు ఇతరమౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. మహిళలను సామాజికంగా,ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు బ్యాంకు లింకేజీద్వారా విరివిగా రుణ సౌకర్యం అందిస్తున్నాం. గతేడాది 25వేల గ్రూపులకు రూ.454.35కోట్లు మంజూరు చేశాం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,929 గ్రూపులకు రూ. 85 కోట్ల బ్యాంకులింకేజీ రుణాలు అందజేశాం. ఆడపిల్లల అభ్యున్నతికి ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మకంగా బంగారు తల్లి పథకాన్నిచట్టం ద్వారా అమలులోనికి తెచ్చింది. ఇప్పటివరకు నమోదైన 1779 మంది ఆడ శిశువులకు పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.ఉపాధి మెండుగా....మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో2012-13 సంవత్సరానికి మన జిల్లా రాష్ట్రస్థాయిలో రెండవస్థానంలో నిలిచింది. ఈ పథకం ద్వారా 2012-13లో 7.40లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించాం. ఇందిర జలప్రభ,ఇందిర ప్రభ కార్యక్రమాల కింద ఎస్సీ, ఎస్టీ రైతులకుచెందిన భూములను సేద్యపు నీటి సౌకర్యం కల్పించడంకోసం రూ.6.90 కోట్లు కేటాయించాం. ఇప్పటివరకు 1177బోరుబావులు తవ్వించాం. విద్యార్థులకు వసతులు..ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా 13 పాఠశాలల స్థాయి, 4 కళాశాలల స్థాయి వసతి గృహాలు, 20 కమ్యూనిటీ భవనాలనిర్మాణం కోసం రూ.26 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఎస్టీసబ్‌ప్లాన్ కింద రూ.26.35 కోట్లతో 10 కళాశాలల వసతిగృహాలు, 8 ఆశ్రమ పాఠశాలలు, 5 డార్‌మెట్రీలు, ఒకయూత్ శిక్షణ కేంద్రం మంజూరయ్యాయి. వెనుకబడిన తరగతులవర్గాలకు చెందిన నిరుద్యోగ యువత వివిధ రకాలైనపోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకించి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశాం.కలెక్టర్‌కు అభినందన...తెలుగు భాషను పాలనా భాషగా అమలు చేయడంలో జిల్లాఆదర్శంగా నిలిచింది.
అంతేగాక రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుల నుంచి ప్రశంసపత్రం అందుకోవడం, 20సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలులో జిల్లాను మూడోస్థానంలో నిలపడం, మీసేవ కార్యక్రమాల అమలులో జిల్లారెండోస్థానం సంపాదించడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్‌ను,అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నా’’ అన్నారు.
వేడుకలో ఏజేసీ హరిజవహర్‌లాల్, చెరుపల్లి సీతారాములు,ఎమ్మెల్సీ రవీందర్, ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, డీసీసీబీచైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌ఓఅంజయ్య, జెడ్పీ సీఈఓ వెంకట్రావు, ఏఎస్పీ సిద్ధయ్య,డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్ పీడీలు రాజేశ్వర్‌రెడ్డి, కోటేశ్వరరావు, శరత్‌బాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య, ఆర్వీఎం పీఓ బాబూ భూక్యా, డీఈఓ జగదీష్,సీపీఓ నాగేశ్వరరావు, సీపీఓ జేడీ మోహన్‌రావు, ఐసీడీఎస్‌పీడీ ఉమాదేవి, డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ప్రగతి పరవళ్లు
Published Fri, Aug 16 2013 3:01 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
Advertisement
Advertisement