
నేను చెప్పిందే కరెక్ట్: బాలకృష్ణ
తన నియోజకవర్గం హిందూపురంలో ఇక సమస్యలు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
హిందుపురం: తన నియోజకవర్గం హిందూపురంలో ఇక సమస్యలు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించుకున్నట్టు భేటీ ముగిసిన తర్వాత చెప్పారు. హిందూపురంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని, త్వరలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. హిందుపురంలో తాను చెప్పిందే కరెక్ట్ అని, సమస్యలన్నీ త్వరలో సర్దుకుంటాయన్నారు. నియోజకవర్గంలో పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.
తన అల్లుడు నారా లోకేశ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేశ్ పాటు పడుతున్నారని అన్నారు. అమరావతిలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరగగనుండడం థ్రిల్లింగ్ ఉంటుందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.