సాక్షి, మంగళగిరి : మంత్రి నారా లోకేశ్ మళ్లీ పప్పులో కాలేశారు. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో నిలిచిన లోకేశ్ గురువారం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. లోకేష్ వ్యాఖ్యలతో తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్ కవర్ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. దీనిపై మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. 'నారా లోకేశ్ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి' అని సెటైర్ వేశారు.
.@naralokesh గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి
— Rama Krishna Reddy A (@MlaRKR) March 21, 2019
ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి#VoteForFan #TDPLosing pic.twitter.com/DMzYMNA2H2
ఇప్పటికే మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు..’, ‘మంచి నీటి సమస్య కల్పన..’, ‘వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు..’ లాంటి వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment