
'రెండు రాష్ట్రాల ప్రజలు సహనంతో ఉండాలి'
తిరుమల: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సహనంతో ఉండాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. త్వరలో రెండు రాష్ట్రాల సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయని నరసింహన్ అన్నారు.
ఆదివారం తిరుమల సందర్శనకు వచ్చిన గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించరాదని సూచించారు. సెక్షన్ 8పై చర్చించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పుడేం మాట్లాడలేనని గవర్నర్ అన్నారు.