అట్లాంటాలో నిర్వహించిన నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) మొదటి, ద్వితీయ సభల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
తిరుపతి : అట్లాంటాలో నిర్వహించిన నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) మొదటి, ద్వితీయ సభల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మొదటి, ద్వితీయ సభలకు నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యుకు ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, అభిమానం వల్లే నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను.
భారత సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ.. తెలుగుదనం ఉట్టిపడేలా.. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒక్కటే అని చాటుతూ నిర్వహించిన సభలు విజయవంతంగా జరిగాయి’’ అని కొనియాడారు. ఈ సభల్లో వివిధ రంగాల ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.