నంద్యాలలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష రసాభాసగా ముగిసింది.
కర్నూలు: నంద్యాలలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష రసాభాసగా ముగిసింది. అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మహిళలు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరుకాకపోవడంతో విసిగిపోయిన ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇళ్లకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు గేట్లు వేశారు.
దీంతో అధికారులతో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఎంతసేపు కూర్చోబెడతారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నవనిర్మాణ దీక్షకు జనం రాకపోవడంతో అధికారులు విద్యార్థులను తరలించారు. సెలవుల్లో ఉన్న విద్యార్థులను దీక్షకు తరలించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.