
అబ్బురపరచిన నౌకాదళ విన్యాసాలు
నేవీడే ఉత్సవాల్లో భాగగా విశాఖపట్నం సముద్రజలాల్లో మంగళవారం ‘డే ఎట్ సీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1,400మంది ప్రజలు, విద్యార్థులను యుద్ధనౌక ఐఎన్‌ఎస్ జలాశ్వపై సముద్రంలోకి తీసుకువెళ్లి యుద్ధ విన్యాసాల ప్రదర్శనను చూపించారు. యుద్ధాలు, సీమాంతర తీవ్రవాదాన్ని ఎలా దీటుగా ఎదుర్కొనేది.., ప్రకృతివిపత్తులు, ఇతర అత్యవసర సందర్భాల్లో సహాయక చర్యలు ఎలా చేపట్టేది నౌకాదళం విన్యాసాలు ప్రదర్శించింది.
నాలుగు యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, హెలికాఫ్టర్లపై నుంచి నౌకాదళ సిబ్బంది అబ్బురపరిచేరీతిలో యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
-సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం