నాకెలాంటి సంబంధం లేదు: నటి నీతూ అగర్వాల్ | Neetu Agarwal Exclusive Interview in Red Sander Smuggling | Sakshi
Sakshi News home page

నాకెలాంటి సంబంధం లేదు: నటి నీతూ అగర్వాల్

Published Thu, May 7 2015 12:42 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

నాకెలాంటి సంబంధం లేదు: నటి నీతూ అగర్వాల్

నాకెలాంటి సంబంధం లేదు: నటి నీతూ అగర్వాల్

కర్నూలు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి నీతూ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె  గురువారం కర్నూలులో  మీడియాతో మాట్లాడారు. మస్తాన్ వలీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాడోపేడో తేల్చుకుంటానని నీతూ అగర్వాల్ అన్నారు.

మస్తాన్ వలీ ఓ రియాల్టర్, నిర్మాతగానే తనకు తెలుసునని ఆమె తెలిపారు. అంతకు మించి అతడి గురించి తనకేమీ తెలియదన్నారు. ఇద్దరం కలసి ప్రేమ ప్రయాణం చిత్రంలో కలిసి నటించామని... ఆ తర్వాత తమ మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకున్నామని వెల్లడించారు.

అయితే అతడి ఎక్కడి నుంచి వచ్చాడు... సినీ రంగానికి ఎలా వచ్చాడు... అనే అంశాలపై మస్తాన్ వలీని  తాను ఏ రోజు ప్రశ్నించలేదన్నారు. ఏటీఎమ్ కార్డు కావాలని ఓ భర్తగా మస్తాన్ అడిగాడని.. భార్యగా తాను ఇచ్చానని ఆమె చెప్పారు. తన ఏటీఎం కార్డును మస్తాన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లు తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. తాను ఏ తప్పు చేయలేదని... భవిష్యత్తులో తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయని నీతూ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement