
మండేలా జీవితం ఓ సందేశం: వైఎస్ విజయమ్మ
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం ఓ సందేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. మండేలా సంతాప తీర్మానాన్ని సీఎం కిరణ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ...మండేలా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అని పేర్కొన్నారు.
భారత జాతిపిత మహాత్మా గాంధీ, లూధర్ కింగ్, నెల్సన్ మండేలాలు మహాపురుషులని వైఎస్ విజయమ్మ ప్రశంసించారు.ఆ మహాపురుషుల జీవితాలకు ఎల్లలు లేవన్నారు. మానవాళిని మాటలు, చేతల ద్వారా నడిపిన మహానీయుల్లో మండేలా ఒకరిని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అలాగే వివిధ పార్టీల శాసనసభ పక్ష నేతలు ఈ సందర్బంగా మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ సందర్బంగా కొనియాడారు.