రాష్ట్రానికి కొత్తగా 19 ఐఏఎస్‌ పోస్టులు! | New IAS posts to state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి కొత్తగా 19 ఐఏఎస్‌ పోస్టులు!

Published Sun, Jul 16 2017 3:07 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

రాష్ట్రానికి కొత్తగా 19 ఐఏఎస్‌ పోస్టులు! - Sakshi

రాష్ట్రానికి కొత్తగా 19 ఐఏఎస్‌ పోస్టులు!

- 230కి పెరగనున్న పోస్టులు
ఇటీవల ఢిల్లీలో జరిగిన కేడర్‌ సమీక్షలో ప్రాథమిక నిర్ణయం
 
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎస్‌ల పోస్టులు పెరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఐఏఎస్‌ కేడర్‌ పోస్టుల సంఖ్య 211 ఉండగా... ఇటీవల ఢిల్లీలో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో కొత్తగా 19 పోస్టులు మంజూరు చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర ఐఏఎస్‌ కేడర్‌ పోస్టుల సంఖ్య 230కి పెరగనుంది. ఇందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌తో 160 పోస్టులుండగా, పదోన్నతుల ద్వారా 70 పోస్టులు ఉండనున్నాయి.

త్వరలోనే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శితో సమీక్ష ఉంటుందని, ఆ సమీక్షలో పోస్టుల సంఖ్యకు అధికారికంగా ఆమోద ముద్రపడుతుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, పదోన్నతులు కలిపి ఐఏఎస్‌ల పోస్టుల సంఖ్య 211 ఉన్నప్పటికీ వాస్తవంగా పనిచేస్తున్న ఐఏఎస్‌లు కేవలం 165 మంది మాత్రమే. అంటే 46 మంది ఐఏఎస్‌ల కొరత ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement