కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి శనివారం రాత్రి అశ్వవాహనంపై శ్రీకాళహస్తి పురవిహారం చేశారు.
శ్రీకాళహస్తి: కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి శనివారం రాత్రి అశ్వవాహనంపై శ్రీకాళహస్తి పురవిహారం చేశారు. నూతన వధువైన జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కైలాసగిరి ప్రదక్షిణ సందర్భంగా ఉదయం వెళ్లిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు తిరిగి సాయంత్రానికి పట్టణ పొలిమేర్లకు వేంచేపుచేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీసంఖ్యలో ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత అశ్వవాహనంపై స్వామివారు అధిరోహించారు.
సింహవాహనంపై అమ్మవారు ఆశీనులయ్యారు. విద్యుత్ దీపాల కాంతిలో వివిధ కళా బృందాల సమక్షంలో ఊరేగింపు వేడుకగా జరిగింది. భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని కర్పూరహారతులిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో రామిరెడ్డి దంపతులతో పాటు అధికారులు పాల్గొన్నారు.