
నెలాఖరులోగా నూతన టూరిజం విధానం
పిబ్రవరి నెలాఖరునాటికి నూతన టూరిజం విధానాన్ని అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: పిబ్రవరి నెలాఖరునాటికి నూతన టూరిజం విధానాన్ని అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టూరిజం విదివిధానాలపై ఆయన సోమవారమిక్కడ ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లో కొత్త టూరిజం పాలసీ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.
ప్రతి 2 లేదా 3 నెలలకు ఫుడ్ ఫెస్టివల్ సహా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులతో పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్నారు. 2020 నాటికి పర్యాటక రంగం ద్వారా రూ. 10 వేల కోట్లు ఆదాయం వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.