కందుకూరు రూరల్: ‘అద్దంకి మండలం పొటికలపూడి పంచాయతీలోని రామచంద్రాపురం ఎస్సీ కాలనీకి మౌలిక వసతులు కరువయ్యాయి. నాలుగేళ్ల క్రితం గుండ్ల ప్రాజెక్టు కింద ముప్పు గ్రామాల నుంచి ఇక్కడకి వచ్చాం. కేవలం స్థలాలు ఇచ్చారే తప్ప ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. కరేంట్ లేదు, మంచినీటి సరఫరా లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి మూడు కిలో మీటర్లు ఉంటుంది. కానీ మంచినీటి వసతి కల్పించడం లేదు. ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది’ అంటూ కాలనీకి చెందిన రామమోహన్‌రావు, చంద్రమ్మ, వెంకమ్మ, అరుణకుమారి, జగదీశ్వరి ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
నడవలేకపోతున్నాడు!
చీరాల అర్బన్: ‘నా మేనల్లుడు బి.నానికి పుట్టుకతో కాలు బాగాలేదు. గతంలో కాలికి ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ తర్వాత కాలు నొప్పిగా ఉండడంతో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం 9 సంవత్సరాల వయస్సు వచ్చినా నడిచేందుకు కాలు సహకరించడంలేదు’ అంటూ కుంకుపాడుకు చెందిన బాలుడి మేనమామ సైమన్ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమస్యను వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment