‘మా ఊరుకు బస్సు సౌకర్యం లేదు. విద్యార్థినులు విద్యాలయాలకు సకాలంలో చేరుకోలేక చదువులు మానేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇప్పుడు ఆర్టీసీ బస్సు వేశారు. ఎన్ని రోజులు నడుపుతారో కూడా తెలియదు. ఈ బస్సు సర్వీసు కూడా ఉదయం 10 గంటలకు వేయడంతో మాకు ప్రయోజనం లేదు. 9 గంటలకు మార్చేలా చూడాలి’ అంటూ నాగులపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని గొర్రెపాటి మాధవి జననేత దృష్టికి తెచ్చారు. – ఒంగోలు వన్‌టౌన్
రుణమాఫీ హామీ బూటకం
‘గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఒట్టి బూటకం. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ టీడీపీ అనుకూల వర్గాలకే వర్తింపజేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పద్మావతి డ్వాక్రా గ్రూపు మహిళలు వల్లంరెడ్డి పద్మావతి, అంజమ్మ, దుగ్గిరెడ్డి ప్రసన్న, పల్లక సుశీల, ఇనమల కోటేశ్వరమ్మ తదితరులు జననేత దృష్టికి తెచ్చారు. – ఒంగోలు వన్‌టౌన్
Comments
Please login to add a commentAdd a comment