'సీఎం ప్రెస్ మీట్ లు పట్టడం తప్ప చేసిందేమి లేదు'
గుంటూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్‌మీట్‌లు పెట్టి వేడివేడి బజ్జీలు పెట్టడం తప్ప ఇప్పటి దాకా చేసిందేమిలేదు అని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆయన పార్టీ పెడతాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని ఆయన తెలిపారు. పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై సీఎం విచారణ చేయిస్తున్నారని మంత్రి డొక్కా అన్నారు.
రెండురోజుల్లో నివేదిక అందుతుందని.. ఆతర్వాతనే అసలు విషయం వెల్లడిస్తా అని ఆయన వెల్లడించారు. ఆర్నెల్లుగా సమైక్య వాదం వినిపిస్తున్నాడేగాని, సరైన ముగింపు ఇవ్వకపోతే ఏం లాభం అని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.