
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ నలుగురు ప్రధాన అర్చకుల్లో ఒకరైన రమణ దీక్షితులుకు టీటీడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అనుమతి లేకుండా తన మనవడిని మహద్వారం నుంచి ఆలయానికి తీసుకొచ్చారు. దీనిపై గతంలోనే ఓసారి ఆలయ విభాగం రమణ దీక్షితులుకు నోటీసులు ఇచ్చి వివరణ కోరింది.
తాజాగా మరోసారి ఆయన మనవడితో సహా ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో మరోసారి కూడా టీటీడీ రమణ దీక్షితులును వివరణ కోరుతూ నోటీసులిచ్చింది. ఆయన కుమారులు వెంకటపతి దీక్షితులు, రాజేష్ దీక్షితుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండటంతో వారి ని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.