మద్దిపాడు (ప్రకాశం జిల్లా) : మద్దిపాడు మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద పురుగుల మందు తాగి దేవరపల్లి కృష్ణారెడ్డి(64) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం కృష్ణారెడ్డి తన కుమారుడితో ఘర్షణ పడినట్లు తెలిసింది. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.