హైదరాబాద్: రెండేళ్ల క్రితం భార్య చనిపోవడంతో మనో వేదనకు గురైన ఓ వృద్ధుడు భార్య సమాధి వద్దే ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పుగూడ నర్కీపూల్ ప్రాంతానికి చెందిన షేక్ సయీద్ గోరీ (65)భార్య రెండేళ్ల క్రితం చనిపోయింది. ఇతని మొదటి భార్య కూడా గతంలోనే చనిపోయింది. 12 మంది పిల్లలు సంతానం ఉన్నారు. కాగా, రెండో భార్య మరణించిన నాటి నుంచి నిరాశ నిసృ్పహలకు గురైన సయీద్ గోరీ తాగుడుకు బానిసయ్యాడు.
ఈ క్రమంలోనే నిత్యం తాగి బార్కాస్-బాలాపూర్ రోడ్డులో ఉన్న భార్య సమాధి వద్దకు రోజూ వెళ్లి రోదిస్తున్నాడు. తాజాగా, శనివారం మధ్యాహ్నం భార్య సమాధి వద్దకు వెళ్లిన సయీద్ గౌరీ తాగిన మైకంలోనే కూరగాయల కత్తితో గొంతుకోసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసుల సాయంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.