కర్నూలులోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను రెండో పట్టణ పోలీసులు మంగళవారం పాత బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు.
కర్నూలు, న్యూస్‌లైన్: కర్నూలులోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులను రెండో పట్టణ పోలీసులు మంగళవారం పాత బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు. పాతబస్తీలోని డబరగుంత ప్రాంతానికి చెందిన పటాన్ ప్రేమ్‌కుమార్ అలియాస్ చూరిముండి అతని సోదరుడు పఠాన్ అమర్‌లను అనుమానంపై అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడిన విషయాన్ని అంగీకరించారు.
జూన్ 18న బంగారుపేటలోని ఫిషరీస్ కాంపౌండ్ వద్ద ఒక ఇంట్లో ప్రవేశించి బంగారు ఆభరణాలతోపాటు ఓ సెల్‌ఫోన్ దొంగలించినట్లు ఒప్పుకొన్నారు. అలాగే మార్చిలో సోమిశెట్టి నగర్‌లో ఒక ఇంట్లో ప్రవేశించి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ దొంగలించినట్లు చెప్పారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. దొంగలను అరెస్ట్ చేసి సొమ్ములను రికవరీ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఏ ఎస్‌ఐ శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ చం ద్రుడు, కానిస్టేబుళ్లు శేఖర్‌బాబు, సుదర్శన్, నాగరాజు, వినోద్‌లను సీఐ బాబుప్రసాద్ అభినందించారు.