ఓం నమఃశివాయ | om namah shivaya | Sakshi
Sakshi News home page

ఓం నమఃశివాయ

Feb 10 2014 4:15 AM | Updated on Sep 2 2017 3:31 AM

ఓం నమఃశివాయ.. హరహర మహదేవ శంభోశంకర అంటూ అశేషభక్త జనం శివనామస్మరణల మధ్య చెర్వుగట్టులోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా జరి గింది.

 నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్: ఓం నమఃశివాయ.. హరహర మహదేవ శంభోశంకర అంటూ అశేషభక్త జనం శివనామస్మరణల మధ్య చెర్వుగట్టులోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా జరి గింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, అర్చుకులు సతీష్‌శర్మ, రాంబాబు, సురేష్, సుధాకర్, పవన్, సిద్ధులు తదితరులు వేదమంత్రాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ కణకణమండే నిప్పు కణికల నుంచి నడుచుకుంటూ వెళ్లా రు. అగ్నిగుండాల్లో ధాన్యం, ఆముదాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.

జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గట్టుపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయరాజు, సర్పంచ్ మల్గ రమణబాలకృష్ణ,  మాజీ చైర్మన్‌లు మేకల రాజిరెడ్డి, రేగట్టే రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణ, గడుసు శశిధర్ రెడ్డి, గాదరి రమేష్ , కమ్మంపాటి వెంకటయ్య,  నర్సింహ, పున్నపురాజు వెంక న్న, మల్గ శంకర్, ప్రభాకర్‌రెడ్డి,మారయ్య , రామరావు, శేఖర్, తిర్పతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రసేనరెడ్డి, శంకర్, రంగరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement